బోర్డర్‌లెస్ గాంధీ ప్రాజెక్ట్స్ : ఆస్ట్రేలియా
- September 24, 2016
ఆస్ట్రేలియాలో గాంధీ జయంతిని విశేషంగా నిర్వహించబోతున్నారు. బోర్డర్‌లెస్ గాంధీ ప్రాజెక్ట్స్ (ఆస్ట్రేలియా) పేరుతో నెల రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్ వచ్చే నెల 2 నుంచి ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గుర్‌గావ్ కళాకారుడు విభోర్ సొగానీకి ఆహ్వానం అందింది. ఆయన 'మహాత్మా ఇన్ మి' (నాలోని మహాత్ముడు) అనే కళారూపాలను ప్రదర్శిస్తారు.
బోర్డర్‌లెస్ గాంధీ ప్రాజెక్ట్స్ (ఆస్ట్రేలియా)ను నీలేష్, లెనే మక్వానా 2014లో స్థాపించారు. 2015లో పెర్త్‌లో అధికారికంగా ప్రారంభమైంది. మహాత్మా గాంధీ సమానత్వం, అహింస, శాంతి వంటివాటికి ప్రపంచ స్థాయి సంకేతమని వివరించే కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
ఈ ఏడాది పెర్త్‌లోని బెల్ టవర్ ఎదుట ఉన్న బారక్ స్ట్రీట్ జెట్టీ వద్ద విభోర్ రూపొందించిన స్టెయిన్‌లెస్ స్టీల్ కళారూపాలను ప్రదర్శిస్తారు. విభోర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి భారతదేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, వెస్టర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వ బహుళ సంస్కృతుల శాఖ, భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి, ఆస్ట్రేలియాలో భారతదేశ హైకమిషనర్ నవదీప్ సూరి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. తాను 12 కళారూపాలను ప్రదర్శిస్తానని తెలిపారు.
సొగాని మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహించేందుకు సంవత్సరం నుంచి చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. భారతీయులుగా మనందరికీ గాంధీజీ గురించి తెలుసునని, అయినప్పటికీ విస్తృత పరిశోధన చేసి గాంధీజీ కాలం కన్నా ఎంతో ముందున్న వ్యక్తి అని తెలుసుకున్నానని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







