ఈగ కట్టుకున్న మట్టి ఇల్లు
- August 11, 2015
ఒక కుమ్మరి వాడు బండి నిండా కుండలు కట్టుకుని అలా వెళ్తున్నాడు. దారిలో ఒక కుండ జారిపడిపోయి దొర్లుకుంటూ ఒక ఆడవిలోకి వెళ్లిపోయింది. అటు వైపుగా ఎగురుకుంటూ వెళ్తున్న ఈగ ఒకటి అరే ఈ మట్టి ఇల్లు భలేగా ఉందే అనుకొని అందులోకి వెళ్లింది. కాస్పేపటికి ఒక దోమ వచ్చి ఈ బుల్లి మట్టి ఇల్లు భలేగా ఉందే దీనిలో ఎవరున్నారు అనుకుని లోపిలికి వెళ్లింది. అందులోంచి ఈగ వచ్చి నువ్వెవరు అని అడిగింది నేను జుమ్మని ఎగిరే దోమను నాక్కూడా నీ ఇంట్లో చోటివ్వవా? అనడగ్గా సరే అంది. తరువాతి రోజు ఒక కప్ప వచ్చింది నువ్వెవరు అని ఈగ అడుగగా నేను బెకబెకలాడే కప్పను నీ ఇళ్లు భలేగా ఉంది నన్ను కూడా ఉండనివ్వవా అని అడిగింది. సరేనంది ఈగ. ఆ తర్వాతి రోజు ఒక చెవుల పిల్లి వచ్చింది. ఎవరు నువ్వు అని ఈగ అడగ్గా నేను చెంగు చెంగున ఎగిరే చెవుల పిల్లిని. నాకు కూడా కొంచెం చోటివ్వరా? అని అడిగింది సరేనన్నాయి ఆ ఇంట్లో ఉంటున్న జంతువులు. ఆ తర్వాత ఒక ఎలుగు బంటి వచ్చింది. అరే భలే ఉందే ఈ బుల్లి మట్టి ఇల్లు ఎవరున్నారు ఈ ఇంట్లో అని అడిగింది. లోపల నుండి ఈగ, దోమ, కప్ప, చెవులపిల్లి బయటికి వచ్చి సరే నువ్వు కూడా మాతో పాటే ఉండు అన్నవి. అందుకు ఆ ఎలుగుబంటి ఇంట్లో నాకు చోలు చాలదు కదా. నేను ఇంటి పైన ఉంటాను అని ఒక కాలు ఆ కుండ మీద వేసింది. అంతే ఠపీమని ఆ కుండ ఇల్లు పగిలి పోయింది. అయ్యో అనుకుని అందులోని జంతువులన్నీ ఎక్కడివక్కడికి ఎగిరిపోయాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







