ఒమనైజేషన్ వేగవంతం - ప్రవాసీయుల ఉద్యోగాలకు ఎసరు!
- August 11, 2015
వేలమంది ఒమాన్ నిరుద్యోగ పౌరులకు ఉపాధి కల్పించడానికి తలపెట్టిన ఒమనైజేషన్ పధకాన్ని ప్రభుత్వం వేగవంతం చేయడంతో, అక్కడ ప్రవాస శ్రామికులు,ఉద్యోగులు తమ ఉపాధి పోతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రతిసంవత్సరం 12,000 మందికి పైగా ఒమాన్ యువత స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలనుంది ఉద్యోగవేట కోసం బయటపడుతుండగా, గతంలో వారు ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే మొగ్గుచూపేవారు. ఐతే ఇపుడు, ప్రభుత్వం ఈ సంవత్సరం మరియు 2016లో కూడా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని నిలిపివేయడంతో,వారిలో కేవలం 60 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలను పొందుతున్న నేపధ్యంలో వారిచూపు ప్రైవేటు రంగంపై పడింది. ఇపుడు ప్రవాసీయుల ఉద్యోగభద్రత అనేది గాలిలో దీపంగా మిగిలింది!
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







