ఒంటెకు నగల అలంకరణ: సోషల్ మీడియాలో విమర్శలు
- September 26, 2016
సోషల్ మీడియాలో ఓ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. వివాదాస్పదం అయ్యింది. ఓ వ్యక్తి, ఒంటెకు ఖరీదైన గోల్డ్ నెక్లెస్‌ని ధరించడం, ఆ సమయంలో పలువురు ఆ సంఘటనను తమ కెమెరాల్లో బంధించడం జరిగింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు, తీవ్రంగా ఖండిస్తూ పోస్టింగ్స్ పెట్టారు. ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని నెటిజన్లు స్పష్టం చేశారు. తన క్యామెల్ (ఒంటె)ను ఎక్కువ ధరకు విక్రమించుకోడానికి ఆ వ్యక్తి ఆ ప్రయత్నం చేసి ఉండొచ్చు. అయితే అది అభ్యంతకరమని నెటిజన్లు స్పష్టం చేశారు. ఇలాంటి చర్యల్ని ప్రతి ఒక్కరూ ఖండించాలనీ, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడ్తోందనీ, ఇలాంటి చర్యల ద్వారా ఆ వ్యక్తి సమాజానికి ఏం చెప్పదలచుకుంటున్నాడని మరికొందరు ప్రశ్నించారు. పేదల పట్ల కృతజ్ఞతా భావం ప్రకటించాల్సిన గొప్ప స్థితిలో ఉండీ, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం శోచనీయమని నెటిజన్లు తూర్పారబట్టారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







