బాంబు పేలి 9మందికి గాయాలు : పాకిస్థాన్
- September 26, 2016
పోలీసు వ్యాన్ లక్ష్యంగా జరిగిన బాంబు దాడిలో నలుగురు పోలీసులు సహా మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారు. సోమవారం పాకిస్థాన్‌లోని చార్సద్దాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం సారోకల్లే ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు వాహనం లక్ష్యంగా దుండగులు రిమోట్‌తో బాంబు పేల్చారు. బాంబు ధాటికి నలుగురు పోలీసులు సహా తొమ్మిది మంది బాటసారులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సహాయ సిబ్బందితో పాటుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారినిచికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో వారిని పెషావర్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!







