చుక్కకూర రొయ్యలు
- September 26, 2016
కావలసిన పదార్థాలు : చిన్న రొయ్యలు (పొట్టు తీసి శుభ్రం చేసినవి) - అరకేజి, చుక్కకూర - 4 కట్టలు, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 2, కారం - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, నూనె - 1 టేబుల్ స్పూను, గరం మసాలా - 1 టీ స్పూను, కొత్తిమీర - 1 కట్ట.
తయారుచేసే విధానం: రొయ్యలకు పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పట్టించి అరగంట పాటు ఉంచాలి. కడాయిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలతో పాటు రొయ్యలను వేసి వేగించాలి. ఐదునిమిషాలు మూతపెట్టి రొయ్యలు మగ్గాక చుక్కకూర తరుగు వేసి కూరని దగ్గరగా ఉడికించుకోవాలి. దించేముందు గరం మసాలాతోపాటు కొత్తిమీరను చల్లుకోవాలి.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







