హెపటైటిస్ నివారణా మార్గాలు
- August 11, 2015
మన శరీరంలోని అతి ప్రధానమైన అవయవాల్లో ఒకటి కాలేయం. కాలేయం శరీరంలోని విషతుల్యాలను, వ్యర్థాలను బయటికి పంపడం దగ్గర్నుంచి, మనం తిన్న ఆహారం తగిన సమయానికి జీర్ణం అయ్యేలా చూడడంలాంటి పనుల్లో ముఖ్య పాత్ర వహిస్తుంది. అయితే దీనికి హెపటైటిస్ వైరస్ల నుండి వచ్చే ఇన్ఫెక్షన్ల ముప్పు చాలా ఎక్కువ. ఈ ఇన్ఫెక్షన్లు వచ్చిన తరువాత మరణానికి చేరువవ్వడం తప్ప చేయగలిగేదేం లేదు. అందుకే హెపటైటిస్ వైరస్ నుండి తప్పించుకోవడానికి కొన్న రకాల జాగ్రత్తలు తప్పనిసరి. ఈ వైరస్ ముఖ్యంగా 5 రకాలు. ఎ,బి,సి,డి,ఇ అని. వీటిలో ఎ, ఇ వైరస్లు అంత ప్రమాదకరం కావు. ఒకవేళ సోకినా మందుల ద్వారా తగ్గించుకోవచ్చు. కామెర్లు వీటి వల్లనే సోకుతాయి. వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారం, నీరు కలుషితం కాకుండా చూసుకోవడం ద్వారా వీటికి దూరంగా ఉండొచ్చు, మిగిలిన బి, సి, డి వైరస్లు మాత్రం ప్రాణాంతకమైనవే. ఇవి ఒకరినుంచి ఒకరకి వివిధ రకాల శరీర ద్రవాల ద్వారా వ్యాప్తి చెందుతాయి కూడా. కాన్పు సమయంలో తల్లికి హెపటైటిస్ బి ఉంటే బిడ్డకు కూడా సోకే ప్రమాదం ఉంది. అందుకే పుట్టిన 12 గంటల్లోపు బిడ్డకి ఈ టీకా వేస్తారు. ఇక మిగిలిన వైరస్‌లకు కూడా టీకాలు అందుబాటులో ఉన్నాయి. హెపటైటిస్ సి వైరస్ నేరుగా రక్తం ద్వారా వ్యాపిస్తుంది. అందుకే రక్తం ఎక్కించేటప్పుడు, ఇతరులు వాడిన ఇంజక్షన్ సూదులు, బ్లేడులులాంటి వాడకంలో జాగ్రత్తగా ఉండాలి.
తాజా వార్తలు
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..







