మెంతి రోటీ
- August 11, 2015
కావలిసిన పదార్ధాలు
గోధుమ పిండి - ఒకటిన్నర కప్పు
మెంతి కూర తరుగు - ముప్పావు కప్పు
మజ్జిగ - కలపడానికి సరిపడా
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
జీలకర్ర - అర టీ స్పూను
గరం మసాలా - ఒక స్పూను
నూనె - సరిపడా
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలోకి గోధుమపిండి తీసుకుని, దానిలో మెంతికూర, మజ్జిగ తప్ప మిగతావన్నీ వేసి బాగా కలపాలి. ఒక బాణలిలో నూనె వేసి మెంతికూరను పచ్చి వాసన పోయే వరకూ వేయించాలి. ఈ వేయించిన మెంతికూరను పైన కలిపిన పిండి మిశ్రమంలో వేసి కలిపి, మజ్జిగ పోసి ముద్దలా చేయాలి. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని పెనం మీద నూనె వేసి కాల్చుకోవాలి. ఇవి ఆరోగ్యానికి మంచివి. రుచికి చక్కనివి.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







