దుబాయ్ లో మతం పేరుతో కూతురిని సముద్రానికి బలి చేసిన తండ్రి
- August 11, 2015
సంప్రదాయం, మతం పేరుతే తండ్రే కన్న కూతురిని పొట్టనబెట్టుకున్న సంఘటన దుబాయ్లో చోటు చేసుకుంది. దుబాయ్ పోలీసు సెర్చ్ అండ్ రెస్క్యూ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అక్కడి స్ధానిక మీడియా ఛానెల్‌తో చెప్పిన దాని ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తన జీవితంలో మరిచిపోలేని సంఘటనగా దీనిని అభివర్ణించాడు. పిక్నిక్‌లో భాగంగా ఆసియాకు చెందిన ఓ కుటుంబం దుబాయ్‌లోని బీచ్‌కి వ్యాహ్యాళికి వచ్చారు. తండ్రితో పాటు పిల్లలు సముద్రం లో ఈత కొట్టేందుకు దిగారు. ఇలా సరదాగా ఈత కొడుతున్న సమయంలో అలల తాకిడికి తన 20 ఏళ్ల కుమార్తె లోపలికి కొట్టుకుపోయింది. దీనిని గమనించిన బే గార్డ్స్ (రక్షక సిబ్బంది) పరుగున వచ్చి వారిని రక్షించబోయారు. రక్షించేందుకు వస్తున్న ఇద్దరూ పురుషులే అని గమనించిన తండ్రి తన కూతురిని కాపాడొద్దని, సముద్రంలో మునిగిపోవాలని సూచించాడు. దీంతో ఆ యువతి నీళ్లలో మునిగి మరణించింది. దీంతో తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకలా చేశావంటూ ప్రశ్నంచారు. యవ్వనంలో ఉన్న తన కుమార్తెను ఎవరైనా పరాయి పురుషుడు తాకితే తమ మతం కఠినంగా శిక్షిస్తుందని, ఆమె ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని సమాధానమిచ్చాడు. అంతకంటే తమ కుమార్తె చనిపోవడమే మేలు అని భావించి అలా చెప్పానని ఆమె తండ్రి చెప్పాడు. సంప్రదాయం, మతం పేరుతో కన్న కూతురే ఓ తండ్రి నిర్ణయానికి బలైందని డిప్యూటీ డైరెక్టర్ లెప్ట్‌నెంట్ కల్నల్ బురిఖ్ మీడియాతో తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







