చైనాలో ఘోర ప్రమాదం
- September 28, 2016
చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గనుల్లో భారీ పేలుడు సంభవించడంతో 19 మంది కార్మికులు మృతిచెందారు. నింగ్జియా హుయ్ ప్రాంతంలోని షిజుయ్‌షన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
లిన్లీ కోల్ మైనింగ్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన ఓ చిన్నపాటి బొగ్గు గనిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో 20 మంది కార్మికులు గనిలో పనిచేస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 18 మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తిని సహాయక సిబ్బంది కాపాడారు.
అయితే ఆ వ్యక్తి కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు. కాగా.. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. మైనింగ్ కంపెనీ ప్రతినిధులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







