పిస్తా తింటే గుండె జబ్బులు దూరం
- August 12, 2015
ఆకలిని నియంత్రించుకోవడానికి కొన్ని రకాల డ్రైఫ్రూట్స్, నట్స్ ఉపయోగపడతాయన్న విషయం తెలిసిందే. అయితే వాటిలో మొదటి స్థానం పిస్తా పప్పులకుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు కొన్ని పిస్తా పప్పులు తింటే ఆకలి తీరినట్లుగా అనిపించి, శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాదు పిస్తా ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. పిస్తాలో ఉండే విటమిన్ 'ఇ' చర్మం మృదువుగా అవ్వడానికి తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. వీటిలోని పోషకాలు కంటి చూపు స్పష్టంగా ఉండడానికి దోహదం చేస్తాయి. అంతేకాకుండా శరీరంలోని అన్ని కణాలకు రక్తం సరఫరా బాగా జరిగేలా చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్ బి6 మెదడు చురుగ్గా పని చేసేలా చేస్తుంది. పిస్తా పప్పులు రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలు తరిగిపోతాయి. పిస్తా గుండెకు చాలా మంచిది. ప్రతి రోజూ పిస్తా తినే అలవాటుండేవారికి గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నరాల్లో రక్తం గడ్డకట్టుకుండా చేస్తుంది. పిస్తా శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. అందుకే మధుమేహం ఉన్నవారు కూడా పిస్తా తింటే చాలా మంచిది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







