ఊపందుకుంటున్న సెబీ

- September 29, 2016 , by Maagulf
ఊపందుకుంటున్న సెబీ

మార్కెట్‌లో మదుపుదార్లు ఒక్కసారిగా విక్రయానికి దిగడంతో సెక్యూరిటీస్‌ ఎక్స్‌చేంజి బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) అప్రమత్తమైంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా షేర్లు, కరెన్సీ ఒక్కసారిగా విలువ కోల్పోయాయి. దీంతో వీటిని ఎదుర్కొనడానికి దేశీయ స్టాక్‌ ఎక్స్‌చేంజిలు ఏ విధంగా సిద్ధంగా ఉన్నాయో తెలుసుకుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ దాదాపు 465 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ దాదాపు 153 పాయింట్ల మేరకు విలువ కోల్పోయింది. రూపాయి కూడా 44.50పైసలు పతనమై ఈ వారంలో కనిష్ఠ విలువైన రూ.66.91కు చేరుకుంది. జూన్‌లో బ్రెగ్జిట్‌ తర్వాత అత్యధిక పతనం ఇదే కావడం గమనార్హం. వూహించని పరిణామాన్ని ఎదుర్కొనడానికి స్టాక్‌మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయో సాయంత్రంలోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com