భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులను ఐక్యరాజసమితి నిశితంగా గమనిస్తోంది

- September 30, 2016 , by Maagulf
భారత్‌-పాక్‌ మధ్య  ఉద్రిక్త పరిస్థితులను ఐక్యరాజసమితి  నిశితంగా గమనిస్తోంది

'ఉరీ ఉగ్రదాడి' అనంతరం భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఐక్యరాజసమితి మిలటరీ విభాగం నిశితంగా గమనిస్తోంది. భారత్‌ జరిపిన లక్షిత దాడుల నేపథ్యంలో భారత్‌-పాక్‌ నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులపై ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్‌ దృష్టి సారించినట్లు ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజరిక్‌ తెలిపారు. భారత్‌-పాక్‌ పరిస్థితులపై ఐరాసలో ఉన్న మిలటరీ అబ్జర్వర్‌ గ్రూప్‌ (యూఎన్‌ఎంవోజీఐపీ) ప్రస్తుత పరిస్థితులపై నివేదిక తెప్పించుకుంటోందని ఆయన చెప్పారు. సరిహద్దులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాలు సమస్యను శాంతియుత వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని డుజరిక్‌ సూచించారు.దీనిపై రెండు ప్రభుత్వాలు పరస్పరం ఒక అవగాహనకు రావాలని కోరారు.
1949 జనవరి 24న యూఎన్‌ఎంవోజీఐపీ ఏర్పడింది. భారత్‌-పాక్‌ మధ్య సరిహద్దు వెంబడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని తద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం దీనిలో స్వీడన్‌కు చెందిన మేజర్‌ జనరల్‌ పెర్‌ గుస్తాఫ్‌ లోదిన్‌ ఆధ్వర్యంలో 10 దేశాలకు చెందిన 41 మంది అబ్జర్వర్లు ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com