గాయాల పాలైన హీరో రామ్
- August 13, 2015
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ 'శివం' షూటింగ్లో గాయపడ్డాడు. యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది. వెంటనే హాస్పటల్ కు తీసుకెళ్లగా, వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పారు. అయితే రామ్ డాక్టర్ల మాటను లెక్కచేయకుండా మళ్లీ షూటింగ్లో పాల్గొన్నాడు. దీంతో ఆ గాయం మరింత పెద్దదై నొప్పి తీవ్రత పెరిగింది. డాక్లర్లను సంప్రదించగా విశ్రాంతి తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే నొప్పి మరింత పెరిగే ప్రమాదముందని, తప్పనిసరిగా నెలరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడం తో రామ్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు . మొదట డాక్టర్ల మాట వినందుకే ఇలా జరిగిందని, అందుకే వైద్యులు చెప్పినట్లు పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నానని ట్విట్టర్లో రామ్ పేర్కొన్నాడు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శివం చిత్రం రాబోతుంది. రామ్‌కు జోడీగా రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా , దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







