చరణ్ సినిమాలో నటిస్తున్న నాగబాబు
- August 13, 2015
శ్రీనువైట్ల, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇటీవల హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నట్లు తెలిసింది. నాగబాబుతో కృతి కర్బందా కాంబినేషన్లో కొన్ని సీన్లు ఉంటాయని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఈ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తారనే వార్తలు టాలీవుడ్లో హల్చల్ చేస్తున్నాయి. కింగ్ నాగార్జున సంగతి ఎలా ఉన్నా....చిరంజీవి మాత్రం ఈ చిత్రంలో నటించడం ఖాయమంటున్నారు మెగా అభిమానులు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో వాయిస్ ఓవర్ చెప్పించాలని దర్శకుడు శ్రీనువైట్ల నిర్ణయించినట్లు సమాచారం. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం 'విజేత' టైటిల్‌నే ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







