ఏఎం రత్నం, పవన్ కళ్యాణ్ ల కలయికలో మరో సినిమా
- September 30, 2016
ఇప్పుడున్న తరాన్ని 'మీకు బాగా ఇష్టమైన సినిమాలు ఏవి '? అని అడిగితే సమాధానంగా చెప్పే వాటిలో 'ఖుషి' పేరు తప్పకుండా ఉంటుంది. అక్కడితో ఆగకుండా, ఆ సినిమా జ్ఞాపకాలన్నీ చెప్పేస్తారు. చాలా మంది యువతకు 'ఖుషి' ఓ మరిచిపోలేని అనుభవం. పవర్ స్టార్ మేనియా తెలుగు యువతను ఊపేస్తున్న రోజుల్లో వచ్చిన ఈ సినిమా అంచనాలను మించిన ప్రభంజనం సృష్టించింది. ఏడాది పాటు థియేటర్లు 'ఖుషి' చేసుకున్నాయి. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అందనంత ఎత్తుకు వెళ్లిపోయారు. 'ఖుషి' నిర్మాత ఏఎం రత్నం 'బంగారం' తర్వాత మరోసారి పవర్ స్టార్ తో సినిమా చేయబోతున్నారు. ఏఎం రత్నంతో సినిమా చేయాలని పవన్ చాలా కాలంగా అనుకుంటున్నారు. ఇప్పటికి ఈ ప్రాజెక్ట్ రూపు దాల్చుతోంది. తమిళంలో విజయ్, మోహన్ లాల్ తో 'జిల్లా' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నీసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.
వేగం పెంచిన పవర్ స్టార్ : రెండు, మూడేళ్ల కో సినిమా చేసే పవన్ కళ్యాణ్..ఇలా అయితే కష్టమ ని భావిస్తున్నారు. ఏడాదిలో కనీసం రెండు సినిమాలైనా చేయాలని నిర్ణయించుకు న్నట్లున్నారు. ప్రస్తుతం కిషోర్ పార్థసాని దర్శకత్వంలో 'కాటమరాయుడు' లో నటిస్తున్న పవన్, ఇటీవలే రెగ్యులర్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దీంతో పాటే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చర్చల దశలో ఉంది. మరోవైపు దాసరి నారాయణ రావు నిర్మాణంలో మరో చిత్రానికి గతంలోనే అంగీకారం తెలిపాడు. ఇప్పుడు శ్రీ సూర్యా మూవీస్ లో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు పవన్.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







