బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- July 22, 2026
మనామా: బహ్రెయిన్‌పై ఇరాన్ చేపట్టిన పలువురు క్షిపణి, డ్రోన్ దాడులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకుని ధ్వంసం చేశాయని బహ్రెయిన్ రక్షణ దళాల (BDF) జనరల్ కమాండ్ ప్రకటించింది.
బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ (BNA) వెల్లడించిన వివరాల ప్రకారం, ఇరాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తోందని జనరల్ కమాండ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి చర్యలు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారుతున్నాయని పేర్కొంది.
పౌరులు, వ్యక్తిగత ఆస్తులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేయడం అంతర్జాతీయ మానవతా చట్టాలకు స్పష్టమైన ఉల్లంఘన అని బహ్రెయిన్ రక్షణ దళాలు పేర్కొన్నాయి.
దేశ భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు కొనసాగుతున్నాయని, ప్రజలు అధికారిక వర్గాలు విడుదల చేసే సూచనలు, సమాచారం మాత్రమే నమ్మాలని బహ్రెయిన్ అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పరిస్థితిని సంబంధిత భద్రతా సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్
- మూడేళ్ల క్రితం తన అరెస్టును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’
- జర్మనీ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్..
- గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- బిగ్బాస్ హౌస్లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
- కొత్త ప్రభుత్వ సీజన్ పై షేక్ మహమ్మద్ సమీక్ష..
- యూఏఈకి తిరిగి వస్తున్న విజ్ ఎయిర్..
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు







