రక్త కాన్సర్‌కు తల్లి పాలతో చెక్
- August 13, 2015
అమ్మ పాలు అమృతంతో సమానం అనేది తెలుగు సూక్తి. సైన్స్ ప్రకారం, వైద్య సలహాల ప్రకారం కూడా తల్లి పాలు మంచి జౌషథం అనే చెప్పాలి. పుట్టిన వెంటనే పడే తల్లిపాలను ముర్రు పాలు అంటారు. వీటిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆక్సిడెంట్లూ ,బిడ్డ పెరుగుదలకు కావాల్సిన అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది సాధారణంగా అందరికీ తెలిసిన సంగతే. అయితే కొత్తగాజరిగిన పరిశోధనల ఫలితంగా ఒక తాజా విషయం బయట పడింది. తల్లి పాలలోని యాంటీ బాడీలు, రోగ నిరోధక శక్తిని పెంచే రసాయనాలు రక్త కాన్సర్‌ను దూరంగా ఉంచడానికి తోడ్పడతాయని తేలింది.తల్లి పాలలోని అనేక ప్రయోజనాలను ఎన్నో పరిశోధనలు బలపరిచాయి. పుట్టిన తర్వాత ఆర్నెళ్లు తల్లి పాలు తాగిన పిల్లలకి, తల్లి పాలు కనీసం ఆర్నెళ్లు కూడా తాగని పిల్లల్లో కన్నా రక్త కాన్సర్ వచ్చే ముప్పు 19 శాతం తక్కువగా ఉందని ఈ అధ్యయనాల్లో తేలింది. వీటిల్లోని యాంటీ బాడీలు, హంతక కణాలు ఏ ఫ్యాక్టరీలోనూ తయారు చేయగల్గినవి కావనీ, అందుకే తప్పకుండా పుట్టిన ప్రతి బిడ్డకీ కనీసం ఆర్నెళ్లు తల్లిపాలు తాగించడం మంచిది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







