2018 కల్లా సిద్ధం కానున్న GCC రైల్ నెట్వర్క్
- August 13, 2015
నిర్దేశిత గడువు కంటే 3 సంవత్సరాల ముందుగానే అంటే 2018 కల్లా GCC రైల్ నెట్వర్క్ పని పూర్తి కానుంది. GCC సెక్ర టేరియల్ జనరల్ వారు వెల్లడించిన ఈ పధకం అభివృద్ధి వివరాల ప్రకారo, గంటకు అత్యధికంగా 220 కి. మీ. వేగంతో వెళ్ళగలిగే ఈ రైలు డీజిల్ తో నడుస్తుందని, కువేట్ నుండి ఒమాన్ వరకు మొత్తం 6 గల్ఫ్ రాజ్యాలగుండా పోయే 2117 కి. మీ. పొడవుగల అత్యాధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆపరేటింగ్ సిస్టం లు గల ఈ రైలు ప్రోజక్టు విలువ 200 బిలియన్ కోట్లనీ తెలిపారు. బహ్రైన్ మరియు సౌదీ అరేబియాలను కలిపే రైల్వే లింకుతో పాటు, కింగ్ హమాద్ కాజ్ వేను, బహ్రైన్ మరియు కతార్ల మధ్య కాజ్ వేతో కలుపబడే ఈ రైలు మార్గం, కువేట్ వద్ద మొదలై మస్కట్ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇంకా, బహ్రైన్లోనున్న ఈ రైలు మార్గాలు అన్ని అనుమతులు పొందాయని కూడా వెల్లడించారు. ఇది ఖలీఫా బిన్ సల్మాన్ పోర్ట్, బహ్రైన్ ఇంటర్నేషనల్ ఏర్ పోర్టులతో పాటు కతార్ వద్ద నిర్మింపబడనున్న కాజ్ వే తో దేశంతర లింకులను కలిగి ఉంటుందని ఆయన వివరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







