బ్రెడ్ ఓపెన్ టోస్ట్
- August 13, 2015
బ్రెడ్ ఓపెన్ టోస్ట్
కావలిసిన పదార్ధాలు
బ్రెడ్ ముక్కలు - రెండు
వెన్న - రెండు స్పూన్లు
లెట్యూస్ లీవ్స్ - రెండు
కూరగాయ ముక్కలు - కావలిసినన్ని
టొమాటో - ఒకటి
కొత్తిమీరా - కొద్దిగా
పచ్చి బఠానీ - రెండు స్పూన్లు
మష్రూమ్స్ - కొద్దిగా
స్వీట్ కార్న్ గింజలు - కొద్దిగా
తయారీ విధానం
బ్రెడ్ ముక్కలకు వెన్న పట్టించి పక్కన ఉంచాలి. కూరగాయలూ, టొమాటోలూ, పుట్టగొడుగులూ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బాణలిలో కొద్దిగా వెన్న వేసి దానిలో పైన తరిగి ఉంచిన ముక్కలన్నింటినీ ఫ్రై చేయాలి. ఆ తరువాత పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్ గింజలు కూడా వేసి బాగా వేయించాలి. తరువాత వెన్న రాసిన బ్రెడ్ ముక్కల్లో ఒకదాన్ని తీసుకుని దాని మీద లెట్యూస్ ఆకు ఉంచి దాని మీద ఫ్రై చేసిన కూరగాయల మిశ్రమాన్ని ఉంచి దాన్ని మరో బ్రెడ్‌తో కవర్ చెయ్యాలి. అంతే పిల్లలకి ఇష్టమైన స్నాక్ ఐటం రెడీ.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







