అద్భుతమైన ఆఫర్లతో జిటెక్స్ ఆటమ్న్ 2016 ప్రారంభం
- October 01, 2016
దుబాయ్: ఎనిమిదిరోజులపాటు జరిగే అత్యద్భుతమైన షాపింగ్ ఫెస్టివల్‌కి దుబాయ్ రిటెయిలర్స్ సంసిద్ధమయ్యారు. జిటెక్స్ షాపర్ ఆటమ్న్ 2016 26 ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈసారి ఇంకా అద్భుతంగా ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి 8 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఈ షాపింగ్ మెగా ఈవెంట్ జరుగుతుంది. శ్యామ్‌సంగ్, హెచ్‌టిసి, సోనీ వంటి సంస్థలు స్మార్ట్ ఫోన్లతో వినియోగదారుల్ని ఆకర్షించనున్నాయి. హెచ్‌పి, డెల్, ఆసుస్, ఏసర్ సంస్థలు పీసీలు, గేమింగ్ మెషీన్లు, ప్రింటర్లను ప్రదర్శించనున్నాయి. అవి ఇవీ అన్నీ ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో వినియోగదారుల కోసం కొలువుదీరుతున్నాయి. లార్జ్ స్క్రీన్ టీవీలు, స్మార్ట్ మొబైల్స్, ట్యాబ్స్, పీసీలు, ల్యాప్‌టాప్‌లు ఈ షోలో ప్రధాన ఆకర్షనగా నిలుస్తాయి. షాపింగ్ ఫెస్టివల్ అనగానే ఆకర్షించే బహుమతులూ మామూలే కదా. ఈసారి గతంలో కన్నా అద్భుతమైన ఆఫర్లతో, బహుమతులతో షాపింగ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. వివిధ సంస్థలు బంపర్ ఆఫర్లతో వినియోగదారుల్ని ఆకర్షించనున్నాయి. షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ ప్రతిసారిలానే ఈసారి కూడా ఉంటుందనీ, ఇంకా గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నట్లు వినియోగదారులు కూడా జిటెక్స్ ఆటమ్న్ కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







