స్నేహం కోసం
- August 13, 2015
ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. దానికి ఏదైనా జంతువుతో స్నేహం చేయాలనిపించింది. అందుకు అడవంతా తిరుగుతూ దారిలో ఒక ముంగిసను కలిసింది. దాన్ని నాతో స్నేహం చేస్తావా? అని అడిగింది. అందుకు ముంగిస నువ్వు చాలా పెద్దగా ఉన్నావు. నేను చాలా చిన్నగా ఉన్నాను. నేనెలా నీతో స్నేహం చేస్తానంది. మరికొంచెం దూరం వెళ్లగా అక్కడ ఒక కుందేళ్ల గుంపు కనిపించింది. వాటిని చూస్తే దానికి ముచ్చటేసింది. దగ్గరకు వెళ్లి నాకు మీతో స్నేహం చేయాలని ఉంది చేస్తారా? అనడిగింది. అమ్మో నువ్వు చాలా పెద్దగా ఉన్నావు. మేము చాలా చిన్నగా ఉన్నాం. నీతో స్నే హం చేస్తే నువ్వు మా గూట్లోకి ఎలా రాగలవు. అందుకు మేం నీతో స్నేహం చెయ్యలేం అన్నాయి. కొంచెం దూరం వెళ్లగా రంగు రంగుల చుక్కలతో జింక కనిపించింది. దానితో జింక నువ్వు నాతో స్నేహం చేస్తావా? అని అడిగింది ఏనుగు. అందుకు జింక నీ ఆకారం చూస్తే ఇంత భారీగా ఉంది. పైగా నువ్వు నాలా చెంగు చెంగుమనుకుంటూ పరుగులు తీయలేవు. నీతో నేను స్నేహం చెయ్యను వెళ్లిపో అంది. ముఖం చిన్నబుచ్చుకుని అక్కడి నుండి దాని గుహకి వెళ్లి రాత్రంతా నిద్రపోకుండా ఏడ్చుకుంటూ కూర్చుంది. మరునాడు ఉదయం గుహ నుంచి బయటికి వచ్చి చూడగా జంతువులన్నీ భయంతో పరుగులు తీస్తుండడం చూసింది. ఏంటి విషయం అని వాటిని ప్రశ్నించగా ఒక భయంకరమైన పెద్దపులి అడవిలోకి వచ్చి మన జంతువులన్నింటినీ తినేస్తోంది అని చెప్పాయి. అందుకు ఆ ఏనుగు ఆ పెద్దపులి దగ్గరకు వెళ్లి ఎందుకు మా అమాయకపు జంతువులను నువ్వు భయపెడ్తున్నావు అని పులితో యుద్ధానికి దిగింది. భయపడిన పులి అక్కడి నుండి పారిపోయింది. పులి బారి నుండి రక్షించినందుకు మిగతా జంతువులన్నీ తమ తప్పు తెలుసుకుని ఏనుగుతో స్నేహం చేయడం మొదలుపెట్టాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







