నెస్లే ఇండియా లిమిటెడ్ కంపెనీకి ఊరట లభించింది
- August 14, 2015
మ్యాగీ నూడుల్స్ తయారీదారు నెస్లే ఇండియా లిమిటెడ్ కంపెనీకి ఊరట లభించింది. ఈ కంపెనీ తయారు చేసిన 9 రకాల నూడుల్స్‌పై భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాథికార సంస్థ(ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ), మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్‌మెంట్(ఎఫ్‌డీఏ) విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు గురువారం కొట్టేసింది. నూడుల్స్‌పై నిషేధం విధించడానికి సహజ న్యాయ సూత్రాలను పాటించలేదని, పైగా నూడుల్స్‌లోని సీసం, ఇతర రసాయనాల పరిమితిని పరీక్షించిన ల్యాబరేటరీలకు తగిన గుర్తింపు లేదని జస్టిస్ వి.ఎం.కనడే, జస్టిస్ బి.పి.కొలాబవాలాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నెస్లే వాదన వినకుండానే ఆ కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పొందిన పంజాబ్, హైదరాబాద్, జైపూర్‌లోని స్వతంత్ర ల్యాబ్స్‌లో నెస్లేకి చెందిన వివిధ రకాల నూడుల్స్‌ను పరీక్షించి... 6వారాల్లో నివేదిక అందించాలని కోర్టు ఆదేశించింది. సీసం స్థాయి పరిమితికి లోబడే ఉంటే... నూడుల్స్ తయారీ, విక్రయాలకు నెస్లే కంపెనీని అనుమతించాలని స్పష్టం చేసింది. మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించి సీసం ఉన్నట్లు ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ పరీక్షల్లో తేలడంతో దేశవ్యాప్తంగా వీటి విక్రయాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో నెస్లే హైకోర్టునాశ్రయించింది. ఇక, బాంబే హైకోర్టు తీర్పును చూసి... సవాలు చేయడానికి న్యాయపరంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ చైర్మన్ ఆశిశ్ బహుగుణ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







