విడుదలైన 'వంగవీటి' సినిమా ట్రైలర్
- October 02, 2016
రక్తచరిత్ర చిత్రం లో ఫ్యాక్షనిజాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన వర్మ, మరోసారి వంగవీటితో రౌడీ ఇజం రాక్షసత్వాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. బెజవాడ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన వంగవీటి మోహన రంగా జీవితం ఆధారంగా తెరకెక్కించిన వంగవీటి చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అహింసామూర్తి జయంతి రోజున హింసాత్మకమైన వంగవీటి సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడం ఒక్క రామ్ గోపాల్ వర్మ కే చెల్లింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే. వంగవీటి కత్తి.. కాపు కాసే శక్తి.. తద్వారా విజయవాడలో రౌడీయిజం పుట్టిందని వాయిస్ ఓవర్ సాంగులో "వంగవీటి" సినిమా ట్రైలర్ ను మొదలుపెట్టాడు రామ్ గోపాల్ వర్మ.
ఒక ముసలి లీడర్ ను స్కెచ్ వేసి లేపేసిన వెంటనే విజయవాడలో రౌడీయిజం పుట్టిందని ఆ స్కెచ్చేసి లేపేసేదే వంగవీటి రాధాకృష్ణ. అక్కడ నుండి అసలు విజయవాడ రౌడీయిజం పాలిటిక్స్ ఎన్ని మలుపులు తిరిగాయి అనేదే కథ. మరో విశేషం ఏంటి అంటే "నా పేరు నెహ్రూ.. మా అన్నయ్య పేరు గాంధి" అంటూ ఇద్దరు కుర్రాళ్లు ఆ ముసలాయన గ్యాంగులో చేరడం చూపించడం తో ఆ ముసలాయన పేరు వెంకటరత్నం అని ట్రైలర్ చూసిన వారు అనుకుంటున్నారు. మొత్తానికి వంగవీటి ట్రైలర్ తో మరో సంచలనం రేపాడు వర్మ..ట్రైలర్ లోనే ఓ రేంజ్ లో చూపించిన వర్మ , సినిమా ఎలా తెరకెక్కించాడో అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి సినిమాలో ఎలా చూపించాడా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







