ఇథియోపియాలో తొక్కిసలాట, భారీ ప్రాణనష్టం
- October 02, 2016
ఇథియోపియాలోని ఒరోమియా ప్రాంతంలో ఏటా జరుపుకొనే పండుగలో తొక్కిసలాట జరిగింది. మతపరమైన పండుగలో కొందరు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు నినాదాలు చేయడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు భాష్పవాయువును ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు లోనైన ప్రజలు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. ఎంతమంది మృతి చెందారనే విషయాన్ని అధికారులు వెల్లడించకపోయినా అక్కడి ప్రతిపక్ష పార్టీలు మాత్రం 50 మంది వరకు మృతి చెందారని ప్రకటిస్తున్నారు. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా ప్రాంతానికి 45 కిమీ దూరంలో ఉన్న బిషోఫ్తులో ఇర్రెక ఫెస్టివల్ ఆఫ్ థ్యాంక్స్‌గివింగ్‌ను ఏటా నిర్వహిస్తారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా వేలాది మంది ప్రజలు ఇందులో పాల్గొంటారు. స్వేచ్ఛ, న్యాయం కావాలంటూ ప్రజలందరూ నినాదాలు చేస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







