'రోజ్ గార్డెన్' ఫీల్ ఉన్న ఫ్రెష్ ప్రేమకథా చిత్రమిది....
- October 03, 2016
కాశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో జరిగే ప్రేమకథా చిత్రంగా 'రోజ్ గార్డెన్' తెరకెక్కుతోంది. నితిన్ నాష్, ఫర్జాజ్ శెట్టి జంటగా జి.రవికుమార్(బాంబే రవి) దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కాశ్మీర్‌లో చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''ఫీల్ ఉన్న ఫ్రెష్ ప్రేమకథా చిత్రమిది. కాశ్మీర్ నేపథ్యంలో సాగుతుంది. రియలిస్టిక్‌గా ఉండేందుకు కాశ్మీర్‌లోనే చిత్రీకరణ జరుపుతున్నాం.ప్రస్తుతం ఇక్కడ ప్రతికూల పరిస్థితులున్నా నిర్మాత వెనకడుగు వేయకుండా షూటింగ్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు'' అని చెప్పారు. ''ఇప్పుడున్న పరిస్థితుల్లో కాశ్మీర్‌లో చిత్రీకరణకు ఎవరూ సిద్ధపడరు.కానీ, మేం ముందుకు రావడంతో ఇక్కడి ప్రభుత్వం అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు భద్రత కూడా కల్పిస్తామని ప్రకటించింది'' అని నిర్మాత శ్రీనివాసరావు అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: చదలవాడ తిరుపతిరావు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







