'మరో దృశ్యం' షూటింగ్ ప్రారంభo...
- October 03, 2016
కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఆర్.ఎమ్. మూవీ మేకర్స్ సంస్థ 'మరో దృశ్యం' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. గౌతమ్, శ్వేత జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి సూర్యాపేట పరిసరాల్లో చిత్రీకరణ జరుపుతామని దర్శకుడు రాజేంద్రప్రసాద్ చెప్పారు. నేరాలు, ఘోరాలు లేని భారతదేశం ఆవిష్కృతమవ్వాలనే కథాంశంతో సినిమా చేస్తున్నామన్నారు. 'వీరనారి చాకలి ఐలమ్మ' చిత్రాన్ని నిర్మించిన తాను ఈ చిత్రానికి సహకారం అందిస్తున్నాననీ, ఓ పాత్రను కూడా పోషిస్తున్నాననీ సోమిరెడ్డి తెలిపారు.తమకిది తొలి చిత్రమని హీరో హీరోయిన్లు తెలిపారు. షఫి, కాదంబరి కిరణ్‌కుమార్, అన్నపూర్ణ, కవిత, ప్రభావతి, చిట్టిబాబు, తిరుపతి ప్రకాశ, వినోద్, జానన్న, కృష్ణన్న, శ్రీహరి తారాగణమూన ఈ చిత్రానికి పాటలు: జయసూర్య, ఛాయాగ్రహణం: భాస్కర్ల మురళి, ఫైట్స్: సుబ్బు, కథ, మాటలు, స్ర్కీనప్లే, సంగీతం, కొరియోగ్రఫీ: కట్ల రాజేంద్రప్రసాద్.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







