ఎర్రకోటపై రెపరెపలాడుతున్న జాతీయ జెండా
- August 14, 2015
బ్రిటిష్ పరిపాలనకు చరమగీతం పాడి 69 సంవత్సరాలు గడచిన నేపథ్యంలో జాతి యావత్తూ చిరునవ్వులు చిందిస్తుండగా దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఎంపీలు, రాజకీయ, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొని దేశమాతకు వందనాలు సమర్పించారు. అంతకు ముందు ప్రధాని మోదీ రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







