పెయిన్ కిల్లర్స్‌తో జాగ్రత్త
- August 14, 2015
నడుం నొప్పి, కాలు నొప్పి, ఒళ్లు నొప్పులు అంటూ వచ్చే నొప్పులకు మనం బ్రూఫిన్, ఆస్ప్రిన్, డైక్లో ఫినాక్ వంటి పెయన్ కిల్లర్స్‌ని ఈజీగా వాడేస్తుంటాం. ఇలాంటి మందులు ఇదివరకటి రోజుల్లో అంతగా మన శరీరం మీద ప్రభావం చూపించలేకపోవచ్చు, కానీ ప్రస్తు పరిస్థితుల్లో మన శరీరంలోని అతి మఖ్యమైన భాగం గుండెపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. వీటి వాడకం వల్ల గుండె పోటు వచ్చే అవకాశమే కాకుండా పక్షపాతం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. వీటినే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్( ఎన్‌ఎస్‌ఏఐడీలు) అంటారు. ఇవి రక్తంలోని ప్లేట్ లెట్స్‌పై ఆస్ప్రిన్ కన్నా భిన్నంగా పని చేస్తాయి. తద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్లేట్ లెట్స్ అన్నీ ఒక్క దగ్గరకు చేరి రక్తం గడ్డకట్టకుండా చేసే ఎంజైమును ఆస్ప్రిన్ అడ్డుకుంటుంది. ఈ రకమైన మందులు రక్తం గడ్డం కట్టడాన్ని ప్రోత్సహించే మరికొన్ని ఎంజైముల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే వీటి వాడకాన్ని ఎంత తగ్గిస్తే మన ఆరోగ్యానికి అంత మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







