'భక్త కన్నప్ప' డైరెక్ట్ చేయాలనుకుంటున్న వంశీ
- October 05, 2016
భక్త కన్నప్ప ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ న్యూస్. ఈ మూవీ స్టోరీని సిద్ధం చేసిన తనికెళ్ల భరణి, ఒకానొక దశలో ఆయనే దీన్ని డైరెక్ట్ చేయాలని అనుకున్నారట. ఎందుకోగానీ దీనికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం కూడా జోరుగానే సాగింది. ఫిల్మ్‌నగర్ నుంచి వెలువడుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఆగిపోలేదని, డైరెక్టర్ కృష్ణవంశీ చేతికి వెళ్లిందని అంటున్నారు.
ఇప్పటికే తనికెళ్ల భరణి స్టోరీని ఫినిష్ చేసి ఈ దర్శకుడికి అప్పగించినట్టు తెలుస్తోంది. మంచు విష్ణు హీరోగా, ఆయన హోం బ్యానర్లో తెరకెక్కేలా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం 'నక్షత్రం' మూవీతో బిజీగావున్న కృష్ణవంశీ, అది పూర్తికాగానే, కన్నప్ప సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమంటున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







