'భక్త కన్నప్ప' డైరెక్ట్ చేయాలనుకుంటున్న వంశీ

- October 05, 2016 , by Maagulf
'భక్త కన్నప్ప' డైరెక్ట్ చేయాలనుకుంటున్న వంశీ

భక్త కన్నప్ప ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ న్యూస్. ఈ మూవీ స్టోరీని సిద్ధం చేసిన తనికెళ్ల భరణి, ఒకానొక దశలో ఆయనే దీన్ని డైరెక్ట్ చేయాలని అనుకున్నారట. ఎందుకోగానీ దీనికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం కూడా జోరుగానే సాగింది. ఫిల్మ్‌నగర్ నుంచి వెలువడుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఆగిపోలేదని, డైరెక్టర్ కృష్ణవంశీ చేతికి వెళ్లిందని అంటున్నారు.
ఇప్పటికే తనికెళ్ల భరణి స్టోరీని ఫినిష్ చేసి ఈ దర్శకుడికి అప్పగించినట్టు తెలుస్తోంది. మంచు విష్ణు హీరోగా, ఆయన హోం బ్యానర్‌లో తెరకెక్కేలా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం 'నక్షత్రం' మూవీతో బిజీగావున్న కృష్ణవంశీ, అది పూర్తికాగానే, కన్నప్ప సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com