దుబాయ్ మెరీనాలో వాటర్ బస్ కోసం ఎన్‌ఓఎల్ సర్వీస్
- October 07, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) ఎన్‌ఓఎల్ కార్డు సర్వీసుల్ని, దుబాయ్ మెరినాకి చెందిన నాలుగు స్టేషన్లలో (అంటే మెరినా ప్రోమెండె, మెరినా వాక్, మెరినా మాల్ మరియు మెరినా టెర్రాస్) చెల్లుబాటయ్యేలా విస్తరించింది. మెరినా ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ మన్సూర్ అల్ ఫలాసి మాట్లాడుతూ మెరైన్ ట్రాన్సిట్ మోడ్స్‌కి కూడా ఎన్‌ఓఎల్ కార్డుల ద్వారా చెల్లింపు కోసం సేవల్ని విస్తరించినట్లుగా తెలిపారు. వాటర్ బస్ పేర్ని ఎన్‌ఓఎల్ కార్డుల ద్వారా చెల్లించడం ద్వారా వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాటర్ బస్ ప్రతి 20 నిమిషాలకూ అందుబాటులో ఉంటుంది. శుక్రవారాలు మరియు పబ్లిక్ హాలిడేస్‌లో మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు వాటర్ బస్ అందుబాటులో ఉంటుంది. ప్రతి వాటర్ బస్‌లో 36 మందికి వీలుగా ఏర్పాటులంటాయి. ఆన్ బోర్డ్ కార్డ్ రీడర్లో ఎన్‌ఓఎల్ కార్డుల్ని స్వైప్ చేయడం ద్వారా వాటర్ బస్ రైడ్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఎన్‌ఓఎల్ కార్డుల్లో మినిమమ్ 11 అరబ్ ఎమిరేట్ దినార్స్ బ్యాలెన్స్ ఉంటేనే వాటర్ బస్‌లోకి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







