రియాద్‌లో 2.7 ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

- October 10, 2016 , by Maagulf
రియాద్‌లో 2.7 ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

రియాద్‌: రియాద్‌లో రోజు రోజుకీ ట్రాఫిక్‌ తీవ్రమవుతున్నాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. సరికొత్తగా ఎప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. దాంతో ట్రాఫిక్‌ సమస్యలు నిత్యకృత్యమైపోయాయి. వాటికి తోడు ట్రాఫిక్‌ ఉల్లంఘనలూ పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబర్‌ 1 వరకు హిజ్రి ఇయర్‌లో మొత్తం 2,309,470 ట్రాఫిక్‌ ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. అతి వేగం, అక్రమ టర్నింగ్‌లు, లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ని లెక్క చేయకుండా దూసుకెళ్ళడం, అభ్యంతకరంగా లైసెన్స్‌ ప్లేట్లు, సీట్‌ బెల్ట్‌ని ఉపయోగించకపోవడం, విండోస్‌ టింటింగ్‌, అక్రమ పార్కింగ్‌, డ్రిఫ్టింగ్‌, సెల్‌ఫోన్‌ ఉపయోగిస్తూ వాహనాలు నడపడం, నిషేధిత సమయాల్లో ట్రక్కుల ప్రయాణం వంటివి ఈ ఉల్లంఘనల్లో ముఖ్యమైనవి. ట్రాఫిక్‌ సమస్యల్ని అధిగమించడానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామనీ, అలాగే ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటున్నామని రియాద్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ మొహమ్మద్‌ బిన్‌ షాబాబ్‌ అల్‌ బుక్మి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com