దుబాయ్‌లో అగ్ని ప్రమాదం: 250 మంది తరలింపు
- October 10, 2016
దుబాయ్: సిలికాన్ ఒయాసిస్‌లోని రెసిడెన్షియల్ టవర్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం అక్కడివారిని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఇద్దరు మహిళలు ఈ ఘటనలో గాయపడ్డారు. మొత్తం 250 మంది నివాసితుల్ని అక్కడినుంచి ఖాళీ చేయించారు అధికారులు. పొగ పీల్చడం ద్వారా 35 మందికి సమస్యలు తలెత్తగా, ఓ గర్భిణీ మహిళ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరో మహిళ కాలికి గాయమయ్యింది. సాయంత్రం 5.43 నిమిషాల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా, వెంటనే సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయ చర్యల్ని ముమ్మరం చేశారు. ప్రమాదంలో ఎవరికీ తీవ్రగాయాలు కాకపోవడం పట్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా తక్షణం స్పందించిన దుబాయ్ సివిల్ డిఫెన్స్‌ని అందరూ అభినందించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







