కాజు-బొప్పాయి ముర్జీ
- October 10, 2016
కావలసిన పదార్థాలు : బాగా పండిన బొప్పాయి పండు - చిన్నది, పంచదార - రెండు కప్పులు, నెయ్యి - కప్పు, యాలకులు పొడి- అర చెంచా
జీడిపప్పు తురుము (పొడవుగా సన్నగా తురిమినది) - మూడు చెంచాలు బాదం తరుము - రెండు చెంచాలు, ఆరెంజ్ లేదా రెడ్ కలర్ - పావు చెంచా
(ఇష్టమైతేనే), మైదా - అర కప్పు, చిక్కటి పాలు - కప్పు, బాదం పప్పు ముక్కలు - చెంచా, కిస్‌మిస్ - 12, పచ్చి కొబ్బరి - పావు కప్పు.
తయారీ విధానం :
ముందుగా బొప్పాయి పండు చెక్కు తీయాలి. తరువాత దానిని శుభ్రం చేసి సగానికి కోసి లోపల గింజలను పూర్తిగా తొలగించి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కల్ని మిక్సీలో వేసి పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో స్పూను నెయ్యి వేసి మైదాను మంచి వాసన వచ్చేవరకు వేయించి ఓ గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్ తీసుకుని దాంట్లో పంచదార ఒక కప్పు, నీళ్లు పోసి చిక్కటి పాకం వచ్చేవరకు ఉడికించి, కప్పు పాలు పోయాలి. పాలు రెండు నిమిషాల్లో విరిగిపోతాయి. అందులో కలర్, మైదా, బొప్పాయి పేస్టు, పచ్చికొబ్బరి, జీడిపప్పు, బాదం తురుము, ముక్కలు వేసి అందులో నెయ్యి పోసి కలపాలి. తరువాత ఓ పళ్లానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోసి పైన కిస్‌మిస్‌లు అందంగా అలంకరిస్తే సరి ‘కాజు-బొప్పాయి ముర్జీ’ రెడీ అయినట్టే. ఇంకా కావాలనుకుంటే కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







