రానున్న పదేళ్లలో 1600పైగా విమానాలు భారత గగన తలంలో ....!
- October 10, 2016
భారత్ సొంతంగా విమానాలు రూపొందించుకోవాల్సిన అవసరముందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ ఆర్కే త్యాగీ చెప్పారు. 'పౌర విమానయానంలో భారత్ ఇప్పుడు తొమ్మిదో స్థానంలో ఉంది. 2020 కల్లా మూడో స్థానంలోకొచ్చే అవకాశం ఉందన్న' భారత ఏరోనాటికల్ సొసైటీ వ్యాఖ్యల్ని ఉదహరించారు. 'పౌర, సైనిక వైమానిక రంగంలో, నైపుణ్య అభివృద్ధిలో విస్తరణకు చాలా అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తన సొంతంగా విమానాలు రూపొందించుకోవాలని' త్యాగీ పేర్కొన్నారు.హెచ్‌ఏఎల్ ఛైర్మన్‌గా చేసిన సేవలకు గాను హిందుస్థాన్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ బహూకరించింది.సొంత విమాన తయారీకి ప్రాథమిక అంచనాలు పూర్తయ్యాయని, 5-7 ఏళ్లలో తయారు చేయవచ్చని తెలిపారు. ఇందుకు ఒక బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని కొన్న దానికన్నా 1 శాతం తక్కువని పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో 1600పైగా విమానాలు భారత గగన తలంలో విహరిస్తాయని వీటికి 200 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి ఉంటుందని త్యాగీ అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







