అనారోగ్యంతో బాధపడుతున్న డిస్కో డాన్సర్
- October 11, 2016
అలనాటి నటుడు మిథున్ చక్రబర్తి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు వారాల క్రితం మిథున్ లాస్‌ఏంజెల్స్‌కి వెళ్లాడు. ప్రస్తుతం దాదా(మిథున్) ముంబయిలో లేడని ఆయన లాస్‌ఏంజెల్స్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడని కనీసం ఫోను కూడా వాడటం లేదని ఆయన మేనేజర్ విజయ్ మీడియాకు వెల్లడించారు. మిథున్ నెల తర్వాతే ముంబయి వస్తారని పేర్కొన్నాడు. మిథున్ 2009లో లక్ చిత్రంలో నటిస్తున్నప్పుడు హెలికాప్టర్ నుంచి కిందకి దూకాల్సిన సన్నివేశం చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దాంతో ఆయన కాలికి తీవ్ర గాయం అయింది. అప్పటికి గాయం పూర్తిగా మానిపోయినా నెలరోజుల క్రితం మళ్లీ నొప్పి మొదలైందని మేనేజర్ విజయ్ చెప్పాడు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







