పార్కింగ్‌ టిక్కెట్స్‌ ఫోర్జరీ: 150,000 దిర్హామ్‌ల జరీమానా

- October 11, 2016 , by Maagulf
పార్కింగ్‌ టిక్కెట్స్‌ ఫోర్జరీ: 150,000 దిర్హామ్‌ల జరీమానా

దుబాయ్‌: ఓ వాహన డ్రైవర్‌కి 150,000 దిర్హామ్‌ల ఫైన్‌ విధించిన ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. 41 ఏళ్ళ ఇండియన్‌ డ్రైవర్‌, పార్కింగ్‌ టిక్కెట్‌ని ట్యాంపర్‌ చేస్తూ ఎమిరేటీ ఇన్‌స్పెక్టర్‌కి దొరికేశాడు. అల్‌ ఖాన్సా రౌండెబౌట్‌ వద్ద ఏప్రిల్‌ 21న ఈ ఘటన వెలుగు చూసింది. ఆ తరువాత మళ్ళీ మూడు రోజులకు ట్యాంపర్‌ టిక్కెట్‌తో పార్కింగ్‌ చేయడంతో ఇన్‌స్పెక్టర్‌కి అనుమానం వచ్చి, అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో ఫోర్జింగ్‌ కుట్ర వెలుగు చూసింది. నిందితుడికి న్యాయస్థానం 15,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది. కేవలం కొద్ది దిర్హామ్‌లను మిగుల్చుకునేందుకు చేసిన ఈ ఫోర్జరీ కారణంగా, పెద్ద మొత్తంలో నిందితుడు జరీమానా చెల్లించాల్సి వచ్చింది. నిందితుడి నుంచి రెండు ఫోర్జరీ చేసిన పార్కింగ్‌ టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని 15 రోజుల్లోగా నిందితుడు అపీల్‌ చేసుకునే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com