పార్కింగ్ టిక్కెట్స్ ఫోర్జరీ: 150,000 దిర్హామ్‌ల జరీమానా
- October 11, 2016
దుబాయ్: ఓ వాహన డ్రైవర్‌కి 150,000 దిర్హామ్‌ల ఫైన్ విధించిన ఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. 41 ఏళ్ళ ఇండియన్ డ్రైవర్, పార్కింగ్ టిక్కెట్‌ని ట్యాంపర్ చేస్తూ ఎమిరేటీ ఇన్స్పెక్టర్కి దొరికేశాడు. అల్ ఖాన్సా రౌండెబౌట్ వద్ద ఏప్రిల్ 21న ఈ ఘటన వెలుగు చూసింది. ఆ తరువాత మళ్ళీ మూడు రోజులకు ట్యాంపర్ టిక్కెట్‌తో పార్కింగ్ చేయడంతో ఇన్స్పెక్టర్కి అనుమానం వచ్చి, అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో ఫోర్జింగ్ కుట్ర వెలుగు చూసింది. నిందితుడికి న్యాయస్థానం 15,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది. కేవలం కొద్ది దిర్హామ్‌లను మిగుల్చుకునేందుకు చేసిన ఈ ఫోర్జరీ కారణంగా, పెద్ద మొత్తంలో నిందితుడు జరీమానా చెల్లించాల్సి వచ్చింది. నిందితుడి నుంచి రెండు ఫోర్జరీ చేసిన పార్కింగ్ టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని 15 రోజుల్లోగా నిందితుడు అపీల్ చేసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







