డ్రాగ్ అండ్ డ్రిఫ్ట్ నైట్
- October 14, 2016
మనామా: ఇక్కానో డ్రాగండ్ డ్రిఫ్ట్ నైట్ సోమవారం బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి) - సాఖిర్లో గగుర్పొడిచే విన్యాసాలతో జరగనుంది. మోటర్ సిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఔత్సాహికులు డ్రాగ్ రేసింగ్ మరియు డ్రిఫ్టింగ్‌లో పాల్గొనేందుకు సొంత కార్లు, మోటర్ బైక్‌లతో రావాల్సి ఉంటుంది. అలాగే అనుభవజ్ఞులు చేసే సాహసాలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. రెండు యాక్టివిటీస్ కోసం సింగిల్ ఫీజుతో ఎంజాయ్ చేయడానికి ఆస్కారం కల్పించారు. డ్రాగ్ అండ్ డ్రిఫ్ట్‌లో ప్యాసింజర్లా ఎంజాయ్ చేయాలనుకునేవారు స్నేహితుడి కారులో అదనపు పీజు చెల్లించి ప్రతి ఈవెంట్లోనూ పాల్గొనేందుకు అవకాశం ఉంది. కేవలం ఒక్క సెకెనులోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం ఈ ఈవెంట్ ప్రత్యేకత. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ గగుర్పొడిచే సాహసకృత్యాలకు డ్రాగ్ అండ్ డ్రిఫ్ట్ కార్యక్రమం పెట్టింది పేరు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







