త్వరలో విజయవాడ కు హై స్పీడ్ రైళ్లు
- October 15, 2016
ఇండియాలో హైస్పీడ్ రైలు వచ్చేస్తోందంటూ ఒకటే వార్తలు. లేటెస్ట్గా మైసూర్- బెంగుళూరు- చెన్నై (వయా విజయవాడ) మీదుగా హైస్పీడ్ ట్రైన్ రానుంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ ప్రాజెక్ట్‌ని జర్మనీ ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిర్మించనుంది. హైస్పీడ్ రైలు ఏర్పాటుపై వచ్చే ఏడాది అధ్యయనం మొదలుపెట్టనుంది జర్మనీ ప్రభుత్వం. ప్రత్యేక కారిడార్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఏడాదిలోగా అధ్యయనం పూర్తి చేయనుంది. ఆ తర్వాత రెండేళ్లలో హైస్పీడ్ రైలును నడిపేలా ప్లాన్ చేస్తామంటు న్నారు రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు. నిజానికి ఈ హైస్పీడ్ కారిడార్ ప్రతిపాదన మొదట మైసూరు నుంచి చెన్నై వరకే ఉంది. కాకపోతే హైస్పీడ్ కారిడార్‌ను విజయవాడ వరకూ పెంచాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు, జర్మనీ ప్రభుత్వానికి సూచించడం, ఓకే చేయడం జరిగిపోయింది.
ఈ విషయమై శుక్రవారం ఢిల్లీలో జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం చర్చలు జరిపింది. హైస్పీడ్ రైల్వే కారిడార్‌తో దక్షిణాది రాష్ర్టాల్లోని ప్రముఖ నగరాలన్నీ అనుసంధానం కావడం, ఇది ప్రాంతీయాభివృద్ధికి మరింత దోహద పడుతుందని సురేశ్ ప్రభు ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి ఆగ్రా వరకు గతిమాన్ ఎక్స్‌ప్రెస్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న విషయం తెల్సిందే!
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







