బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మీ
- October 16, 2016
సిల్వర్ స్క్రీన్ మీద ఎంత బోల్డ్‌గా యాక్ట్ చేసినా.. సరైన సక్సెస్ రాక సతమతమవుతోంది జబర్దస్త్ యాంకర్ రష్మీ. వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా చిన్న చిన్న సినిమాలు చేస్తున్న రష్మికి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ మారుతి తన నెక్స్ట్ మూవీలో రష్మికి హీరోయిన్గా ఆఫర్ ఇచ్చాడట. నానితో 'భలే భలే మగాడివోయ్', వెంకీతో 'బాబు బంగారం' చెయ్యకముందు మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' లాంటి యూత్ కంటెంట్ వున్న మూవీస్ తీసి హిట్ కొట్టాడు.ఇప్పుడు మళ్ళీ అలాంటి యూత్ కంటెంట్ వున్న ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఈ మూవీలో రష్మిని హీరోయిన్గా తీసుకోవాలనుకుంటున్నాడట.అదే నిజం అయితే.. సరైన ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న రష్మికి జబర్దస్త్ ఆఫర్ వచ్చినట్టే. అయితే ఈ మూవీని మారుతి సొంతంగా నిర్మించబోతున్నాడట. మరి ఈ మూవీని మారుతి డైరెక్ట్ చేస్తాడా లేక మరెవరికైనా అవకాశం ఇస్తాడా అనేది క్లారిటీ రావాల్సి వుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







