మెగాస్టార్ తో స్టెప్పులేయడం తన పూర్వజన్మ సుకృతమని లక్ష్మీరాయ్ అంటోంది
- October 16, 2016
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150'లో కేథరిన్ ట్రెసా బదులు.. 'తోబ..తోబ' గర్ల్ లక్ష్మీరాయ్‌కి భలే ఛాన్స్ లభించింది. ఇది తన లక్ అని మురిసిపోతూ తన ట్విటర్లో.. తమ ఫొటోను పోస్ట్ చేసింది. 'చిరంజీవిగారితో ఈ సినిమాలో ఐటం సాంగ్ చేస్తున్నానంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. ఆయన అంటే నాకెంతో అభిమానం' అని పేర్కొంది లక్ష్మీ రాయ్.చిరు బ్రదర్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'సర్దార్' మూవీలో ఊరించిన ఈ అమ్మడు.. ఇప్పడు మెగాస్టార్ తో స్టెప్పులేయడం తన పూర్వజన్మ సుకృతమని అంటోంది. ఈ ఐటం సాంగ్ చిరంజీవి కుమార్తె సుస్మిత పర్యవేక్షణలో సాగడం విశేషం. సుస్మితతో గొడవ పడడంవల్లే కేథరిన్ ఈ చిత్రం నుంచి ఔట్ అయిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







