వచ్చే నెలలో భారత్ లో పర్యటించనున్న బ్రిటన్ ప్రధానమంత్రి ..
- October 16, 2016
బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే వచ్చే నెలలో భారత్ లో పర్యటించనున్నారు. నవంబర్ 6 నుంచి 8వ తేదీ వరకూ మూడురోజుల పాటు ఆమె భారత్ లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ఓ ప్రకటన చేసింది. థెరిసా మే ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత యూరప్ మినహా బయట దేశాలతో ద్వైపాక్షిక చర్చలకు రావటం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో థెరెస్సా మే చర్చలు జరుపనున్నారు. ఇరు దేశాల మధ్య అన్ని రకాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. ఉమ్మడి ఆర్థిక, వాణిజ్య తదితర అంశాలపై ఈ పర్యటనలో చర్చ జరగనుంది. ఆమె వెంట 16 మంది వ్యాపార ప్రతినిధులు కూడా భారత్కు రానున్నారు. కాగా మే నెలలో చైనాలో హాంగ్ఝౌలో జరిగిన జీ-20 దేశాల సదస్సులో ప్రధాని మోదీ...థెరిసాను భారత్లో పర్యటించేందుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







