బ్రెజిల్ జైల్లో కలకలం
- October 17, 2016
బ్రెజిల్ ఉత్తర ప్రాంతలోని రొరైమా రాష్ట్ర రాజధాని బవా విస్టా నగరంలో వున్న జైలులో ఆదివారం రాత్రి ఖైదీల మధ్య జరిగిన ఘర్షణల్లో 25 మంది మరణించినట్లు పోలీసులను ఉటంకిస్తూ స్థానిక మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించింది. జైల్లో జరిగిన ఘర్షణలో మృతుల్లో ఏడుగురికి తల నరికివేశారని, మరో ఆరుగురిని సజీవ దహనం చేశారని పోలీసులు తెలిపారు. ఖైదీలలో ఒక వర్గం వారు మరో వర్గంపై దాడి చేసినపుడు ఈ ఘర్షణ చెలరేగింది. కత్తులు, కర్రల వంటి మారణాయుధాలు చేపట్టి ఖైదీలు తమ ప్రత్యర్థులపై దాడి చేశారని జైలులోనే వున్న ఖైదీలలో ఒకరి భార్య మీడియాకు చెప్పింది. ఖైదీలను సందర్శించేందుకు వారి బంధువులు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ చెలరేగిందని, ఖైదీలకు చెందిన దాదాపు వంద మంది బంధితులను కొద్దిసేపు నిర్బంధించారని రొరైమా న్యాయశాఖ మంత్రి ఉజీల్ కాస్ట్రో వివరించారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







