జర్మనీలో భారీ పేలుడు..
- October 17, 2016

జర్మనీ లుద్విగ్షెఫెన్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిందని అధికారులు తెలిపారు. ఘటనలో పలువురు గల్లంతయ్యారు. అనేకమంది గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు అనంతరం చెలరేగిన మంటలను ఆర్పేందుకు పెద్ద సంఖ్యలో ఫైరింజన్లను ఘటనా స్థలానికి తరలించారు. పేలుడుకు గల కారణాలపై విచారణకు ఆదేశించారు. కెమికల్ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల వారు పేలుడు తర్వాత నల్లటి మేఘాలను, ఎగసిపడుతున్న మంటలను చూశామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ కెమికల్ ఫ్యాక్టరీలో 33 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పెట్రో కెమికల్స్, ప్లాస్టిక్స్, ఫెర్టిలైజర్స్ ఇక్కడ తయారౌతాయి.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







