బాగ్దాద్‌లో మళ్ళీ పేలుడు.. 10మంది మృతి
- October 17, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో మళ్లీ పేలుడు సంభవించింది. ఇరాకీ ఆర్మీ చెక్‌పోస్ట్ లక్ష్యంగా కారు బాంబుతో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయినట్లు భద్రత, వైద్య సిబ్బంది వెల్లడించారు. మరో 17 మంది గాయాలపాలైనట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల స్వాధీనంలో ఉన్న మొసుల్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇరాకీ సేనలు దాడులు ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఉగ్రవాదులు బాగ్దాద్‌పై విరుచుకుపడ్డారు. అయితే ఈ ఘటనపై ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.
రెండు రోజుల క్రితం బాగ్దాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 50 మంది మరణించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!







