ఒడిషాలో భారీ అగ్నిప్రమాదం
- October 17, 2016
ఒడిషాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భువనేశ్వర్లోని ఐఎంఎస్ & ఎస్యూఎం ఆస్పత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 22 మంది మృతి చెందగా, 75 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఐసీయూ వార్డులో కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వార్డులో కదలలేని స్థితిలో ఉన్న వారు అక్కడికక్కడే కాలిపోయారు. మొదట డయాలసిస్ వార్డులో మంటలు చెలరేగి, మెడిసిన్, ఐసీయూ వార్డులకు మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50వేలు పరిహారాన్ని అందిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. షాక్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొంత మంది పరిస్థితి విషమంగా మారింది. మృతులు, క్షతగాత్రుల వివరాలను తమకు పంపాలంటూ కేంద్రం తెలిపింది.
ఐసీయూలో ఉన్నవారు కూడా చనిపోయిన వ్యక్తుల్లో ఉండటం గమనార్హం. 9ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!







