పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ‘నేత్ర’
- October 17, 2016
రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్లుగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్ హార్ట్ అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంది. నవంబర్ రెండో వారంలో ఆడియో విడుదల చేసి అదే నెల చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ... ‘‘ విశాఖ, అరకు, రాజమండ్రి ప్రాంతాల్లో షూటింగ్ జరిపాము. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. దర్శకుడు చిత్రాన్ని చెప్పిదానికంటే కూడా అద్భుతంగా తెరకెక్కించారు. అవుట్ పుట్ పట్ల యూనిట్ సభ్యులమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. నవంబర్ రెండో వారంలో ఆడియో విడుదల చేసి, అదే నె చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
చిత్ర దర్శకుడు రెడ్డెం యాదకుమార్ మాట్లాడుతూ... ‘గతంలో నేను ‘లైఫ్’ అనే చిత్రాన్ని డైరక్ట్ చేస్తూ నటించాను. ‘నేత్ర’ నా రెండో సినిమా. ఈ సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేశాను. దీన్ని లవ్ అండ్ హర్రర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాము. సిటీ నేపథ్యంతో పాటు గ్రామీణ నేపథ్యంలో కూడా కథ నడుస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది. ఫైనల్ అవుట్ పుట్ చూసిన మా నిర్మాత చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఒక మంచి సినిమా చేశామంటూ టీమ్ అంతా ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం. నటీనటుందరూ కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సత్యానంద్‌గారు, వారి అబ్బాయి పాత్రలు సినిమాకు చాలా కీలకంగా ఉంటాయి. వీరిరువురూ కలిసి నటించడం ఇదే ప్రథమం’’ అన్నారు.
గోపిచరణ్, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, స్టార్‌మేకర్ సత్యానంద్, ఐకె త్రినాధ్, ధీరేంద్ర ధీరు, బుగత సత్యనారాయణ, హేమ, రేణుక, రాఘవేంద్ర, ప్రియాంక, సునీల్ చరణ్, తిరుమరెడ్డి, జబర్దస్త్ అప్పారావు, జనార్ధన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్‌నాగ్ రతన్‌దాస్, మాటలు ప్రసాదుల మధుబాబు, కెమెరా: ఎస్.వి. గోపాల్, ఎడిటింగ్: నర్సింగ్ రాధోడ్, కొరియోగ్రఫి: లుక్స్ రాజశేఖర్, బాలకృష్ణ, ఫైట్స్: బాజీరావు, నిర్మాత: పీరికట్ల రాము, కథ ` స్క్రీన్‌ప్లే ` దర్శకత్వం: రెడ్డెం యాదకుమార్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







