రష్యా యువకుడు వద్ద స్వాధీనం చేసుకున్న డ్రోన్..
- October 18, 2016
రామనాథపురం జిల్లా రామేశ్వరంలో ప్రసిద్ధిచెందిన రామనాథ ఆలయంపై డ్రోన్ సహాయంతో వీడియో తీసిన రష్యాకు చెందిన హరే కృష్ణ హరే రామ సభ్యుడిని పోలీసులు మంగళవారం నిర్బంధించారు. పురాతన రామనాథస్వామి ఆలయానికి సంవత్సరమంతా స్వదేశీ, విదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. హరే రామ హరే కృష్ణ సంస్థకు చెందిన 81 మంది రష్యా నుంచి ఆధ్యాత్మిక పర్యటన పేరుతో మంగళవారం ఉదయం రామేశ్వరానికి వచ్చారు. వారు రామేశ్వరం ఆలయ రథ వీధిలో భక్తిగీతాలు ఆలపిస్తూ ఊరేగింపుగా వెళ్లారు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఆకాశంలో ఓ డ్రోన్ శబ్దం చేసుకుంటూ ఎగురుతుండటాన్ని ఆలయ సిబ్బంది గమనించారు. ఆ డ్రోన్‌కు అమర్చిన కెమెరాతో రామనాథస్వామి ఆలయం, పరిసర ప్రాంతాలను వీడియో తీస్తుండగా అడ్డుకొని స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశారువెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆలయ అధికారుల అనుమతి లేకుండా ఎగురవేసిన డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నూత్తిజిలుసాన అనే వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- Dubai ESC Confirms Readiness for Global Village's 31st Season
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు







